Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం''వెల్కమ్‌ టు హెల్‌''..

”వెల్కమ్‌ టు హెల్‌”..

- Advertisement -

అమెరికా సైన్యానికి ఇరాన్‌ పత్రిక స్వాగతం
టెహ్రాన్‌:
అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న తరుణంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధాన్ని ముగించే మార్గం దొరకక ఇబ్బంది పడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఏకంగా 10 వేల మంది సైనికులను ఇరాన్‌కు పంపాలని నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అమెరికా బలగాల రాకపై ఇరాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘టెహ్రాన్‌ టైమ్స్‌’ అత్యంత ఘాటుగా స్పందించింది. తన తాజా సంచికలో అమెరికా సైనికుల ఫోటోను ప్రచురిస్తూ, దానికి ”వెల్కమ్‌ టు హెల్‌” (నరకానికి ఆహ్వానం) అని పేర్కొంది..”వెల్‌కమ్‌ టు హెల్‌” అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనంలో ఇరాన్‌ భూభాగంలోకి అడుగుపెట్టే అమెరికా సైనికులు ”శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికా మరో 10,000 వరకు భూసేనలను మధ్యప్రాచ్యానికి పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇరాన్‌పై భూస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.అదనపు అమెరికా సైనికులను ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో మోహరించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖర్గ్‌ దీవి పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంచనా వేసింది.ఈ చర్య ఇరాన్‌ లోపల భూతల సైనిక చర్యకు వాషింగ్టన్‌ సిద్ధమవుతోందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. సంఘర్షణను ముగించే లక్ష్యంతో టెహ్రాన్‌ వాషింగ్టన్‌తో శాంతి చర్చలలో నిమగమై ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే చెబుతున్నా.. ఈ సైనిక మోహరింపు వివాదాస్పదంగా మారుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -