Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం: ఎమ్మెల్యే కొత్త

కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం: ఎమ్మెల్యే కొత్త

- Advertisement -

 నవతెలంగాణ – దుబ్బాక 
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని, అందులో చదువుతున్న విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ సంక్షేమ హాస్టళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లన్నీ నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ చార్జీలని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

శనివారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు యూరియా సకాలంలో అందక పంటలను తొలగిస్తున్నారని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్య మన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 92 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ల అధికారులు హమీద్, సయ్యద్ రఫీక్, బాపురాజు, పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -