Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం...

కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యమవుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని 35 వార్డులలో ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన సభలలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, భీమా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు  ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజలకు రేషన్ కార్డులు అందాయని  గుర్తు చేశారు. గతంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే 60 మంది వైద్యులతో సూపర్ స్పెషాలిటీ వైద్యం రోగులకు అందుతుందన్నారు. రూ. 25 కోట్ల తో జిల్లా కేంద్ర ఆసుపత్రి లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రోగులకు ఐ సి యూ సేవలతో పాటు ఆక్సిజన్ సదుపాయాలు  అందుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. . ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ ,  వైస్ చైర్ పర్సన్, పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్,  మున్సిపల్ మాజీ చైర్మన్ జహంగీర్ గా,  కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ , మునిసిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -