Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్అర్హులందరికీ సంక్షేమ పథకాలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- Advertisement -

రుద్రంగిలో లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ 
నవతెలంగాణ – రుద్రంగి

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ  ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తుందని, ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో రుద్రంగి మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని  అన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందని,దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డుతో పాటు గత ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు అప్పటి ప్రభుత్వం అందించిందని తెలిపారు.

ప్రస్తుతం మన ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు.రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం ఉగాది నుంచి ప్రారంభించామని, దీనితో రేషన్ కార్డ్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని అన్నారు.రేషన్ కార్డు పొందిన లబ్ధిదారుల్లో భవిష్యత్తులో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, 25 లక్షల రైతులకు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40 శాతం డైట్ చార్జీలు,200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంపు,అల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల చేపట్టామని అన్నారు.

 రుద్రంగి మండల అభివృద్ధికి కృషి…

రుద్రంగి మండలన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని విప్ పేర్కొన్నారు.ఇప్పటికే మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రుద్రంగి మండల కేంద్రంలో ఏటీసీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.కోటి 50 లక్షలతో గ్రామం మధ్యలో సిసి రోడ్డు నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి,మాజీ జడ్పీటీసీ లు పొద్దుపొడుపు లింగారెడ్డి,గట్ల మినయ్య,మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్,నాయకులు ఎర్రం గంగానర్సయ్య,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,తుం జలపతి తర్రె లింగం,దువ్వక గంగాధర్,అభిలాష్, తహసీల్దార్,ఎంపీడీఓ,అన్ని శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -