Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సమర్థ నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్

సీఎం సమర్థ నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పాలన కొనసాగడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందడంతో ప్రజల్లో ఆనందం వెళ్లి విరుస్తోందని మద్నూర్ గ్రామ సర్పంచ్ సూర్య వంశి ప్రకాష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ గ్రామ సభ సర్పంచ్  సూర్యవంశం ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామసభలో సర్పంచ్ ద్వారా స్వాగత్ ఉపన్యాసం పరిచయం కార్యక్రమం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ కార్యదర్శి మాధవరావు పథకాల అమలు గురించి ప్రజలకు చదివి వినిపించారు గ్రామ సమస్యలు పరిష్కారానికై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసభ ప్రత్యేక అధికారి మండల డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ పాల్గొన్నారు. గ్రామ సభ ప్రత్యేక అధికారికి సర్పంచ్ సూర్యవంశం ప్రకాష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ గ్రామ సభ లో వివిధ శాఖల అధికారులు. పంచాయతీ వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -