Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలనతో రాఘవపురానికి సంక్షేమ పథకాలు

ప్రజాపాలనతో రాఘవపురానికి సంక్షేమ పథకాలు

- Advertisement -

ఎంపీ, ఎమ్మెల్యే లతో మరింత అభివృద్ధి 
ఆరె ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు 
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

రాఘవపురం గ్రామం సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకల శ్రీలత శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించి నవతెలంగాణతో మాట్లాడారు. రాఘవపురం గ్రామ ప్రజలకు నమస్కరించి  తనకు ఎన్నికల అధికారులు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. మాజీ ఎం పీ టీ సీ కాంగ్రెస్ నాయకులు ఆరె ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు.

రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు రుణమాఫీ లాంటి పథకాలు అనేకం రాఘవపురం గ్రామంలో లబ్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ల సాకారంతో రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే శ్రీలత ను గెలిపించాలని ప్రజలను పేరుపేరునా నమస్కరిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకట నరసింహారెడ్డి,మేకల ఉపేందర్ సాయబోయిన శివ,కృష్ణ హరి,శ్రీను పోటీలో ఉన్న వార్డ్ మెంబర్లు ఎర్ర రజిత,పారుపల్లి కళ్యాణి,ఉప్పల శ్యామల,ఆర్ఎస్ స్వర్ణలత,గౌడ గణేష్,తాళ్ల సంబరాజు,వస్పరి మల్లేష్,బొంకూరి నరసింహారావు,ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -