Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ 
నవతెలంగాణ – బాల్కొండ 
: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ కార్యకర్తలకు సూచించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ కార్యకర్తలకు సూచిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తౌట్ అరవింద్, మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ జావిద్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -