– ప్రతి పథకం గడప గడపకు చేరాలి
– ప్రజలకు పాలకులకు సోషల్ మీడియా వారధిగా నిలవాలి
– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
రానున్న స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో – ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్లు పాలకులకు ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను తీపి కొట్టాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలను అందిస్తుందని ఈ విషయాలను ప్రతిపక్ష నాయకులకు గుర్తించాలని హితబోధ చేశారు. ప్రజా సంక్షేమాన్ని విడిచి స్వలాభం కోసం పనిచేసిన నాయకులకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రతిపక్ష నాయకులకు ఓటుతో చురకలు అంటిస్తారని అన్నారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, రాయపర్తి టౌన్ కో-ఆర్డినేటర్ ఉబ్బని నవీన్, మండల కో-ఆర్డినేటర్ గుగులోత్ వెంకన్న, వివిధ గ్రామాల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES