మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్, పిఓ చిత్ర మిశ్రా ఘనంగా సన్మానం
నవతెలంగాణ – తాడ్వాయి : పదో తరగతి ఫలితాల్లో తాడ్వాయి మండలంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థిని, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. ఏప్రిల్ 30 తారీఖున విడుదలైన పది ఫలితాల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 100% శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల కోడిశల, తాడ్వాయి ఏ హెచ్ ఎస్, మేడారం ఇంగ్లీష్ మీడియం, ఊరట్టం ఆశ్రమ పాఠశాల మొత్తం నాలుగు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలురు 21, బాలికలు 194, మొత్తం 215 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 215 మంది కి మొత్తం 215 మంది పాసై 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ నాలుగు గిరిజన గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 100% పాస్ అయి ప్రభంజనం సృష్టించారు. ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాలు ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు ప్రైవేటు క్లాసులు తీసుకొని విద్యను అందించారు. ఎక్కడో మార్మూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతోపాటు మండలంలో ఉత్తమ ఫలితాలు 100% రావడానికి ఎంతో కృషి చేశారు. వారి కృషికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిడి పోచం లు వారిని అభినందించారు. మే ఒకటో తారీకు నాడు స్థానిక మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి శరత్, సంస్థ కార్యదర్శి కే ఢసీతాలక్ష్మి.. గిరిజన గురుకులాల విద్యార్థులను గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ప్రధాన కార్యాలయ అధికారుల కృషిని ప్రశంసించారు.
‘పది’ ఫలితాల్లో సంక్షేమ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES