- Advertisement -
యువ ఆర్చర్‌కు సీఎం అభినందన
హైదరాబాద్ : ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ వర్థమాన ఆర్చర్ చికిత తానిపర్తిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. మహిళల అండర్-21 విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్ పార్క్ యెరిన్‌పై గెలుపొందిన చికిత యూత్ వరల్డ్ చాంపియన్‌గా నిలువటం దేశానికి గర్వకారణం. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన చికిత (పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, సుల్తాన్‌పూర్ గ్రామం) ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యసాధన సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకమని రేవంత్ రెడ్డి అన్నారు. చికిత భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
- Advertisement -