Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ట్రాఫిక్ బారికేడ్లను అందజేసిన వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యం

ట్రాఫిక్ బారికేడ్లను అందజేసిన వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యం

- Advertisement -

నవతెలంగాణ -కంఠేశ్వర్
ఈ నెల 29 న ప్రారంభం కానున్న వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యం వారు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లను శుక్రవారం ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ ఐ వినోద్, శేఖర్, ఆర్ఎస్ఐ సుమన్, చంద్రశేఖర్  సిబ్బంది కి 100 బారికేడ్లను అందించారు. ఈ  సందర్భముగా ఏసిపి మస్తాన్ అలీ మాట్లాడుతూ.. ఇట్టి బారికేడ్లను నిజామాబాద్ నగరములో ట్రాఫిక్ ను నియంత్రించడానికి, రోడ్ పైన ఇతర అవసముల కొరకు ఉపయోగిస్తామని తెలియజేశారు.  వాహనదారులు రోడ్ పైన వాహనములు పార్కింగ్ చేయవద్దని, పార్కింగ్ సెల్లార్, పెయిడ్ పార్కింగ్ మరియు కాలి స్థలములలో చేయవలెనని సూచించారు. వాహనదారులు రోడ్ నియమాలను పాటించాలని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మిగతా హాస్పిటల్స్ యాజమాన్యం వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు. హాస్పిటల్ యాజమాన్యం బోదు అశోక్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. హాస్పిటల్ యందు సెల్లార్ పార్కింగ్ కలదని, వాలెట్ పార్కింగ్ సౌకర్యం ఉంటుందని అలాగే ట్రాఫిక్ నియంత్రణలో తమ భాగస్వామ్యం ఎల్లపుడు ఉంటుందని తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad