Monday, October 13, 2025
E-PAPER
Homeఆటలువిండీస్‌ ఎదురీత

విండీస్‌ ఎదురీత

- Advertisement -

తొలి ఇన్నింగ్స్‌లో 248/10, ఫాలోఆన్‌లో 173/2
కుల్‌దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్ల మాయాజాలం
భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టు మూడో రోజు


భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెండున్నర రోజులు భారత బ్యాటర్లు, స్పిన్నర్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించగా.. మూడో రోజు ఆఖర్లో కరీబియన్ల నుంచి ప్రతిఘటన మొదలైంది. కుల్‌దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్ల మాయతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులుకే కుప్పకూలి ఫాలోఆన్‌ ప్రమాదంలో పడింది. ఫాలోఆన్‌లో ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. జాన్‌ కాంప్‌బెల్‌ (87 నాటౌట్‌), షారు హౌప్‌ (66 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీలతో కరీబియన్లను రేసులో నిలిపారు. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 97 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.

నవతెలంగాణ-హైదరాబాద్‌
జాన్‌ కాంప్‌బెల్‌ (87 నాటౌట్‌, 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షారు హౌప్‌ (66 నాటౌట్‌, 103 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో వెస్టిండీస్‌ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కాంప్‌బెల్‌, హౌప్‌లు భారత స్పిన్‌, పేస్‌ వికెట్ల వేటకు అడ్డుకట్ట వేయగలిగారు. కాంప్‌బెల్‌, హౌప్‌ మెరుపులతో ఫాలోఆన్‌లో వెస్టిండీస్‌ 49 ఓవర్లలో 173/2తో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ మరో 97 పరుగుల వెనుకంజలోనే కొనసాగుతుంది.

విండీస్‌ బ్యాటర్లు మరోసారి భారత్‌ను బ్యాటింగ్‌కు రప్పిస్తారా? అనేది నేడు చూడాలి. అంతకుముందు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (5/82) ఐదు వికెట్ల మాయకు రవీంద్ర జడేజా (3/46) మ్యాజిక్‌ జత కలవటంతో కరీబియన్లు తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగుల లోటుతో నిలిచిన విండీస్‌ ఫాలోఆన్‌ ప్రమాదంలో పడగా.. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విండీస్‌ను ఊహించినట్టుగానే ఫాలోఆన్‌ ఆడించాడు.

కుల్‌దీప్‌ మాయ
140/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌ ఎంతో సేపు భారత బౌలర్ల ఎదురుదాడి ఎదురొడ్డి నిలువలేదు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మాయాజాలానికి విండీస్‌ మిడిల్‌ ఆర్డర్‌ విలవిల్లాడింది. విండీస్‌ బ్యాటర్లలో అలిక్‌ అతనాజె (41), చందర్‌పాల్‌ (34), షారు హౌప్‌ (36) సహా లోయర్‌ ఆర్డర్‌లో ఖారీ పీయర్రీ (23), అండర్సన్‌ ఫిలిప్‌ (24)లు ఫర్వాలేదనిపించారు. 81.5 ఓవర్లలో 248 పరుగులకే విండీస్‌ కుప్పకూలింది. జస్టిస్‌ గ్రీవ్స్‌ (17), అతనాజె (0), హౌప్‌, జేడెన్‌ (13), టెవిన్‌ ఇమ్లాచ్‌ (21)లు కుల్‌దీప్‌ యాదవ్‌ వలలో పడ్డారు. లంచ్‌ సెషన్‌ తర్వాత వరకు సాగిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. మూడో రోజులో మరో 148 పరుగులు జోడించారు. చివరి ఆరు వికెట్లకు విండీస్‌ మెరుగైన ప్రదర్శన చేసింది.

తడబడినా..
ఫాలోఆన్‌లో వెస్టిండీస్‌ మళ్లీ కుప్పకూలేలా కనిపించింది. ఓపెనర్‌ చందర్‌పాల్‌ (10), నం.3 బ్యాటర్‌ అలిక్‌ అతనాజె (7)లు ఆరంభంలోనే అవుటయ్యారు. 14.3 ఓవర్లలో విండీస్‌ 35/2తో కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో ఓపెనర్‌ కాంప్‌బెల్‌ (87 నాటౌట్‌), షారు హౌప్‌ (66 నాటౌట్‌) మూడో వికెట్‌కు అజేయంగా 34.3 ఓవర్లలో 138 పరుగులు జోడించారు. పిచ్‌ నుంచి పేస్‌ లేకపోవటం, స్పిన్‌కు అనుకూలించినా బౌన్స్‌, పేస్‌ లేమి బ్యాటర్లకు అనుకూలించింది. భారత పేసర్లు, స్పిన్నర్లు చెమటోడ్చినా మూడో రోజు విండీస్‌ మరో వికెట్‌ కోల్పోలేదు. మహ్మద్‌ సిరాజ్‌ (1/10), వాషింగ్టన్‌ సుందర్‌ (1/44)లు చెరో వికెట్‌ పడగొట్టారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 518/5 డిక్లేర్డ్‌
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ : కాంప్‌బెల్‌ (సి) సాయి (బి) జడేజా 10, చందర్‌పాల్‌ (సి) రాహుల్‌ (బి) జడేజా 34, అతనాజె (సి) జడేజా (బి) కుల్‌దీప్‌ 41, హౌప్‌ (బి) కుల్‌దీప్‌ 36, ఛేజ్‌ (సి,బి) జడేజా 0, ఇమ్లాచ్‌ (ఎల్బీ) కుల్‌దీప్‌ 21, జస్టిస్‌ (ఎల్బీ) కుల్‌దీప్‌ 17, ఖారీ (బి) బుమ్రా 23, జొమెల్‌ (బి) సిరాజ్‌ 1, ఫిలిప్‌ నాటౌట్‌ 24, జేడెన్‌ (ఎల్బీ) కుల్‌దీప్‌ 13, ఎక్స్‌ట్రాలు : 28, మొత్తం : (81.5 ఓవర్లలో ఆలౌట్‌) 248.
వికెట్ల పతనం : 1-21, 2-87, 3-106, 4-107, 5-156, 6-163, 7-74, 8-175, 9-221, 10-248.
బౌలింగ్‌ : బుమ్రా 14-4-40-1, సిరాజ్‌ 9-2-16-1, జడేజా 19-5-46-5, కుల్‌దీప్‌ 26.5-4-82-5, వాషింగ్టన్‌ 13-2-41-0.
వెస్టీండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌) : కాంప్‌బెల్‌ నాటౌట్‌ 87, చందర్‌పాల్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 10, అతనాజె (బి) సుందర్‌ 7, హౌప్‌ నాటౌట్‌ 66, ఎక్స్‌ట్రాలు :3, మొత్తం : (49 ఓవర్లలో 2 వికెట్లకు) 173.
వికెట్ల పతనం : 1-17, 2-35.
బౌలింగ్‌ : సిరాజ్‌ 6-2-10-1, జడేజా 14-3-52-0, వాషింగ్టన్‌ 13-3-44-1, కుల్‌దీప్‌ 11-0-53-0, బుమ్రా 4-2-9-0, జైస్వాల్‌ 1-0-3-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -