Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఆటలువన్డే సిరీస్‌ విజేత వెస్టిండీస్‌

వన్డే సిరీస్‌ విజేత వెస్టిండీస్‌

- Advertisement -

మూడో మ్యాచ్‌లో పాక్‌పై 202 పరుగుల తేడాతో గెలుపు
ట్రినిడాడ్‌:
నిర్ణయాత్మక మూడో, చివరి వన్డేలో వెస్టిండీస్‌ 202 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేడన్‌ సీల్స్‌ ఆరు వికెట్లు తీసుకోగా, కెప్టెన్‌ శారు హోప్‌ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో వన్డే సిరీస్‌ను విండీస్‌ 2-1తేడాతో కైవసం చేసుకుంది. 1991 తర్వాత అంటే.. 34ఏళ్ల తర్వాత పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను విండీస్‌ గెలుచుకుంది. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. విండీస్‌ జట్టులో కెప్టెన్‌ హోప్‌(120నాటౌట్‌) సెంచరీతో రాణించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. రోస్టన్‌ ఛేజ్‌(36), జస్టిన్‌ గ్రీవ్స్‌(43) పరుగులతో రాణించారు. విండీస్‌ 42 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులతో కష్టాల్లో పడింది. ఆ దశలో హోప్‌, గ్రీవ్స్‌ భారీ షాట్లతో 8 ఓవర్లలో 110 పరుగులు జతచేశారు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, అబ్రార్‌ అహ్మద్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 295 టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేడన్‌ సీల్స్‌(6/18) షాకిచ్చాడు. దీంతో పాకిస్తాన్‌ 29.2ఓవర్లలో 92 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. అఘా సల్మాన్‌(30), నవాజ్‌(23), హసన్‌ నవాజ్‌(13) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. మోటీకి రెండు, ఛేస్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హోప్‌కు, సిరీస్‌ సీల్స్‌కు దక్కాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad