Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి 

తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి 

- Advertisement -

మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి 
పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి 
నవతెలంగాణ – రామారెడ్డి 

భారీ వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని వేషరతుగా కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి రైతులతో కలిసి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ… రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న రకానికి రూ.500 చెల్లించాలని, వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, సన్న రకానికి రెండు దాపలు బోనస్ రైతులకు అందించలేదని, వెంటనే అందించాలని, అందించని పక్షంలో బి ఆర్ ఎస్ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు నర్సారెడ్డి, టంకర్ రవి, లింగాపురం శంకర్, తిరుపతి, సుతారి నరేష్, జంగం లింగం, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -