Sunday, November 9, 2025
E-PAPER
Homeదర్వాజపదిలమేనా!

పదిలమేనా!

- Advertisement -

నీ లోపలి చిట్టి పక్షి కుశలమేనా!
మెత్తని ఈకలతో
మదువైన మేనితో
వెచ్చగా రెక్కలు పొదువుకున్న పక్షి అది
అనంత సముద్రతలంపై విహరిస్తూ
గొంతులో ఆనందలోకాన్ని గానం చేసిన పక్షి
ఎంతటి తుఫానునూ
ఎదిరించి ఎగిరిన నిబ్బరం ఆ పక్షిది
ఇప్పుడు
ఈ చిన్ని రొట్టెముక్కను అడుగుతోంది
ఆ పక్షేనా!!
నీ లోపలి చిట్టి పక్షి పదిలమేనా!?

  • ఫణిమాధవి కన్నోజు, 7659834544
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -