ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూ తీరదు
అసలే తప్తిచెందదు
దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది
ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు
ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు
ఎంతకూ తప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది
ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది
దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది
ఏమి జంతువది
ఎంతకూ తప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు
ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ
దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ
అందరూ దాని కోసం ప్రార్థించండి
ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
– అస్సామీ మూలం: నీలిం కుమార్
ఆంగ్లానువాదం : నీలిమ్ కుమార్
తెలుగు : వారాల ఆనంద్
ఏమి జంతువది
- Advertisement -
- Advertisement -