Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా ప్రాంగణాల్లో ఆటలేవి.?

క్రీడా ప్రాంగణాల్లో ఆటలేవి.?

- Advertisement -

నిరుపయోగంగా మారిన మైదానాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం గ్రామపంచాయతీలు, గిరిజన తండాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. అయితే లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ మైదానాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. మండలంలో 15 గ్రామాల్లో అవి అలంకార ప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు సమకూర్చారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మైదానంలోనూ ఆటలు జరిగిన దాఖలాలు లేవు. కొన్నిచోట్ల కేవలం బోర్డులు ఏర్పాటు చేసి పని ముగిసినట్టుగా చూపించారు.

గ్రామాలకు దూరంగా..
ప్రభుత్వ స్థలాలు లభించకపోవడంతో గ్రామాలకు దూరంగా మైదానాలు నిర్మించారు. దీంతో అనేక గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఎక్కడున్నాయో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి నెలకొంది. తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, రుద్రారం, కొండంపేట, నాచారం, ఆన్సాన్పల్లి, మల్లంపల్లి, ఇప్పలపల్లి , కొయ్యుర్, వళ్లెంకుంట, దుబ్బపేట, ఎడ్లపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లో మైదానాలు ఏర్పాటు చేశారు. ఏ మైదానం చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి, ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టులు, సింగిల్, డబుల్ బార్లు తుప్పుపట్టిన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతిని ధులు స్పందించి క్రీడా మైదానాలను వినియోగం లోకి తీసుకురావాలని ప్రజలు, యువత కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -