Wednesday, February 11, 2026
E-PAPER
Homeఆటలుఏంటీ బ్రో..అది బౌలింగ్ అంటారా..?

ఏంటీ బ్రో..అది బౌలింగ్ అంటారా..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్ టీం రెండు విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. టోర్నీలో మొద‌టి మ్యాచ్‌లో నెద‌ర్లాండ్ జ‌ట్టుపై చివ‌రి బంతి వ‌ర‌కు పోరాడి విజ‌యం సాధించ‌గా, మంగ‌ళ‌వారం యూఎస్ఏ టీంపై రెండో విజ‌యాన్ని అందుకుంది. ఈ గేమ్‌లో పాక్ ప్లేయ‌ర్ వేసిన బౌలింగ్ పై నెట్టింటా తీవ్ర చ‌ర్చ సాగుతోంది. ఏంటి బ్రో.. అది బౌలింగ్ అంటారా అని సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఇంత‌కు ఎవ‌రా బౌల‌ర్లు అనుకుంటారా.. ఉస్మాన్ తారిక్ .. నెమ్మ‌దిగా ఆగి త్రో వేస్తున్నాడ‌ని, గ్రేట్ త్రో బౌలింగ్ అంటూ క్రికెట్ అభిమానులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ త‌ర‌హా బౌలింగ్ గ‌ల్లీ క్రికెట్‌లో కూడా వేయర‌ని అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఉస్మాన్ బౌలింగ్ పై అనేక వ్యంగ్య వీడియోలు వైరల్‌గా మారాయి.

అయితే ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ 3వికెట్లు తీశాడు. అతని యాక్షన్‌పై ఇంతకుముందే ఐసీసీ క్లియర్ ఇచ్చినప్పటికీ.. కొలంబోలో కొంతమంది అమెరికా అభిమానులు అతన్ని ఆటపట్టిస్తూ కనిపించారు. ఈనెల 12న‌ కొలంబో వేదిక‌గా భార‌త్-పాకిస్థాన్ టీంల మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై భార‌త్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -