1978నాటి తీర్పును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన సుప్రీం
మార్చి 17నుంచి విచారణ
న్యూఢిల్లీ : విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ సార్వభౌమాధికార విధులు, దాని సాధనాలు లేదా ఉపకరణాలన్నీ పారిశ్రామిక వివాదాల చట్టం కింద ‘పారిశ్రామిక కార్యకలాపాలు’ నిర్వచనం కిందకు వస్తాయా రావా అనే అంశాన్ని సుప్రీంకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుంది. ఇందుకు సంబంధించిన 2002 నాటి కేసులో మార్చి 17 నుంచి ఈ బెంచ్ విచారణ ప్రారంభించనుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తన పదవీకాలంలో తొలిసారిగా 9మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
బెంగళూరు వాటర్ సప్లై, సూయేజీ బోర్డ్ వర్సెస్ ఎ.రాజప్ప కేసులో 1978లో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఈ ప్రస్తావన చేయబడింది. ఈ తీర్పు ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని పారిశ్రామిక వివాదాల చట్టంలో సెక్షన్ 2(జె) కింద విస్తృతం చేసింది. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, మున్సిపాలిటీలను కూడా పరిశ్రమల్లోకి చేర్చింది. ఈ నేపథ్యంలో ఏం ‘రాష్ట్ర లేదా సార్వభౌమ విధులు’ సెక్షన్ 2(జె) కింద పరిశ్రమల నిర్వచనం పరిధిలోకి వస్తాయో వివరణ ఇవ్వాలని 9మంది న్యాయమూర్తులతో కూడిన ప్రతిపాదిత బెంచ్‌ను సుప్రీంకోర్టు కోరింది.
‘పరిశ్రమలు’ నిర్వచనం కింద ఏం వస్తాయి?
- Advertisement -
- Advertisement -



