Tuesday, March 31, 2026
E-PAPER
Homeసినిమా'ఇంకా ఏం అనుకోలేదు'..

‘ఇంకా ఏం అనుకోలేదు’..

- Advertisement -

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి ‘ఇంకా ఏం అనుకోలేదు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత-దర్శకుల జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను మంగళవారం విడుదల చేశారు. సాధారణ ప్రమోషన్‌ విధానంలో కాకుండా వినూత్నంగా మీమ్స్‌తో నిండిన సరదా వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో వ్యంగ్యంతో పాటు పాత ఈటీవీ థీమ్‌ను గుర్తుచేసే అంశాలు, హాస్యభరితమైన శైలి కనిపించాయి. అలాగే ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్‌ వెల్లడించకపోవడం ఆసక్తిని మరింత పెంచింది. ఈ బ్రోమాంటిక్‌ కామెడీ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్‌ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -