- Advertisement -
బీహార్ ఎన్నికల సందర్భంగా ఓట్ చోరీ అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ చోరీ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. లెక్కలు, ఆధారాలతో సహా దొంగ ఓట్లను ఆయన బట్టబయలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహాఘట్ బంధన్ విజయం సాధించలేకపోయినప్పటికీ ఓట్ చోరీ గురించి మాత్రం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు బీహార్‌లో ఎన్డీయే కూటమే మరోసారి గెలిచింది. అక్కడ వరసగా మూడుసార్లు అధికారంలో ఉండి, తాము గెలవలేమని భావించిన తర్వాత… బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓట్ చోరీకి పాల్పడ్డాయి. ఇప్పుడు మరోసారి అదే కూటమి గెలిచింది, ఇక ఇప్పటి నుంచి ఏం చోరీ చేస్తారో అని మేధావులు జంకుతున్నారు.
కే.ఎన్.నరహరి
- Advertisement -


