Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమా'రాయవలస'లో ఏం జరిగింది?

‘రాయవలస’లో ఏం జరిగింది?

- Advertisement -

రేసన్‌ ప్రొడక్షన్స్‌ తమ తొలి చిత్రమైన ‘రాయవలస’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో గోపీ కష్ణ జె నిర్మిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేశారు.
కార్తిక్‌ని హీరోగా పరిచయం చేసి నవ యువ కథానాయకుడుగా ఆవిష్కరించడం ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చింది. అమెరికాలో పెరిగిన కార్తిక్‌ సింగర్‌గా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. సింగర్‌ మాత్రమే కాక, వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌, ఎన్నో ప్రైవేట్‌ ఆల్బమ్‌లలో నటించి, రైటర్‌, లిరిసిస్ట్‌, డ్యాన్సర్‌గా ప్రతిభ చాటారు. హీరో, టైటిల్‌ను విద్యార్థుల మధ్య ఒక కాలేజీలో గ్రాండ్‌గా లాంచ్‌ చేయడం, డెబ్యూ హీరో కార్తిక్‌ జయంతి పవర్‌ఫుల్‌, ఇంటెన్స్‌ లుక్‌తో ప్రజలు, సినీ ప్రముఖుల దష్టిని వెంటనే ఆకర్షించింది. నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఒక రైస్‌మిల్‌ యజమాని రాజు జీవితం చుట్టూ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, గ్రామ పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్‌ ప్రవేశం అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్‌, సంగీతంతో కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది అని మేకర్స్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -