టెహ్రాన్/టెల్ అవీవ్ : ఇరాన్ యుద్ధం మొదలై 30 రోజులు గడిచాయి. ఆదివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. షఫ్ట్ నగరం సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న జనావాసాలపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాక్‌లోకి కుర్దు ప్రాంత అధ్యక్షుడి నివాసంపై అమెరికా-ఇజ్రాయిల్ దాడి చేశాయని ఇరాన్ ఆరోపించింది. కాగా ఆదివారం ఉదయం ఇరాన్ వైపు నుంచి వచ్చిన పది డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశామని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరపవచ్చునన్న సమాచారంతో యూఏఈ రక్షణ శాఖ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేసింది.
కువైట్‌పై కూడా ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది. దీంతో దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో జర్నలిస్టులు చనిపోయిన ఉదంతంపై రాజధాని బీరుట్లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని సఫద్ నగరానికి సమీపంలో ఉన్న మహావా అలన్ స్థావరం పైన, బెరెయా స్థావరం పైన క్షిపణి దాడి చేశామని హెజ్బొల్లా తెలిపింది. హెజ్బొల్లా దాడిలో తమ సైనికుడొకరు చనిపోయారని ఇజ్రాయిల్ చెప్పింది. టెల్ అవీవ్‌లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శన జరిగింది.
30వ రోజు ఏం జరిగింది ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



