– మోడీ, ట్రంప్ స్నేహంపై తొలగిపోతున్న భ్రమలు
– అమెరికా ఊసరవెల్లి రాజకీయాలు
– ద్వైపాక్షిక సంబంధాలు డొల్లే..!
– యూఎస్‌కు మిత్రదేశంగా మారుతున్న పాక్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందని నిన్న మొన్నటి వరకూ అనేక మంది అధికార పార్టీ నేతలు ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? భారత్ ఉత్పత్తులపై ట్రంప్ ఏకంగా పాతిక శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు, చమురు కొనుగోలు చేయడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. సుంకాల వడ్డనకు ఆయన ఇదే కారణం చూపారు. నరేంద్ర మోడీ 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా ట్రంప్ 2016లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. వీరిద్దరి మధ్య సైద్ధాంతిక, రాజకీయ, వ్యక్తిగత సారూప్యతలు ఉండటంతో వీరి స్నేహం నిజమేనని పలువురు విశ్వసించారు.
2019లోనే మారిన ట్రంప్ వైఖరి
మోడీ, ట్రంప్ మైత్రీ బంధం కారణంగా రెండు దేశాలు దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకుంటాయని, వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ కారణాలే కాకుండా ఇరువురు నాయకుల మధ్య ఉన్న స్నేహం కూడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని అనేకులు భావించారు. కానీ ట్రంప్ ఉద్దేశాలు, అమెరికా ప్రయోజనాలు వేరు. దాన్ని గ్రహించకుండా స్నేహం ఒక గర్వకారణమైన అంశంగా అధికార పక్షం ప్రచారం సాగించింది. నిజానికి 2019 నుంచే భారత్ విషయంలో ట్రంప్ వైఖరిలో మార్పు కనిపించింది. భారత్‌ను జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రోగ్రామ్ నుంచి అమెరికా తొలగించింది. అయితే అమెరికాకు భారత్ ఎగుమతులపై ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. వాస్తవానికి కొన్ని రంగాల్లో ఎగుమతులు పెరిగాయి కూడా. కాబట్టి అమెరికా చర్య మన దేశంలో పెద్దగా ఆందోళన కలిగించలేదు.
సైనిక మిత్ర దేశంగా పాక్
ఆపరేషన్ సిందూర్ ముగింపు మోడీకి తీవ్ర అవమానాన్ని మిగిల్చింది. ట్రంప్‌తో మోడీ బంధం, ఆయన భౌగోళిక రాజకీయ శక్తి సామర్ధ్యాలు పగటి కలలేనని తేలిపోయింది. నిజానికి ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికాకు పాకిస్తాన్ ఓ ముఖ్యమైన సైనిక మిత్రదేశంగా మారింది. పాకిస్తాన్ సైనిక వ్యవస్థ దక్షిణాస ియాలో అమెరికాకు అత్యంత సన్నిహిత భాగస్వామిగా నిలిచింది. అమెరికా తో ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించాలని కూడా పాకిస్తాన్ కోరుకుంటోంది. పాక్ సైనిక దళాల అధిపతి అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శాంతి నెలకొనడానికి మునీర్ కృషే కారణమని ఆయన కొనియాడా రు. ఈ పరిణామాలు భారత్‌ను సహజంగానే దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా విదేశాంగ విధానం యొక్క స్వభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపో వడమే ఈ దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి కారణం.
భారత్ దుర్బలత్వాన్ని ఆసరా చేసుకొని…
అయితే ఈ కారణాలతోనే భారత్‌తో సంబంధాలను తెంచుకోవాలని అమెరికా కోరుకుంటోందని చెప్పడానికి లేదు. ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న శత్రుత్వం, వాటి చర్యల పర్యవసానాల గురించి సమకాలీన ప్రపంచంలోని ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ ప్రస్తుతం చైనాపై ఆర్థికంగా ఆధారపడుతున్నప్పటికీ దానికి వ్యతిరేకంగానే ఉన్నదని అమెరికా విశ్వసిస్తోంది. అందుకే అమెరికా, నాటో చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ సమూహంలో భారత్ చేరగలిగింది. భారతదేశం యొక్క ఈ వ్యూహాత్మక దుర్బలత్వాన్ని ఉపయోగించుకొని తనకు అనుకూలంగా ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఉదాహరణకు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్నే తీసుకుందాం. భారత వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగంలోకి అధిక సబ్సిడీతో అమెరికా రైతులను అనుమతించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అమెరికా నుంచి చౌకగా ఆహార పదార్థాలు, పాడి ఉత్పత్తులు, జన్యుపరంగా అభివృద్ధి చేసిన పంటలు, ఇథనాల్ భారత్‌లో ప్రవేశిస్తే చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. వారి జీవనోపాధి దెబ్బతింటుంది.
ప్రపంచ దేశాలపై భారం వేసేందుకే…
ఔషధాల దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. డాలర్‌ను బలహీనపరచేందుకు బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలపై మండిపడ్డారు. రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై కస్సుబుస్సు లాడారు. అసలు అమెరికా ఉద్దేశం వాణిజ్య చర్చలు జరపడం కాదు. భారత్ దుర్బలత్వాన్ని ఆసరాగా చేసుకొని బెదిరింపులతో దాడి చేయడం. వాటికి భారత్ లొంగిపోతే అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. ప్రతిఫలంగా పొందేదేమీ ఉండదు. అమెరికా బెదిరింపులను ఎదుర్కొంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదు. ‘మేకింగ్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే వాణిజ్య వ్యూహంలో భాగంగా తన సైనిక వ్యయాన్ని, పన్ను కోతల భారాన్ని, రుణ చెల్లింపులను ప్రపంచ జనాభాపై రుద్దడమే అమెరికా ఉద్దేశం. అమెరికా కార్పొరేట్లకు, ప్రభుత్వానికి మాత్రమే లబ్ది చేకూర్చే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక ఉన్న లక్ష్యం అదే.
విశ్వగురు ఏం చేస్తారు?
మరి ఇప్పుడు మన విశ్వగురు ఏం చేస్తారు? అనేక దేశాలు ట్రంప్ బెదిరింపులు, ప్రతిపాదనలను పట్టించుకోకుండా తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, ఇరాన్ వంటి దేశాల నేతలు ట్రంప్ విధానాలను ఎండగడుతూ ప్రజామోదం పొందుతున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న నూతన విధానాలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రధాని మోడీ వైఖరేమిటన్నది అంతుచిక్కకుండా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారకుడినని ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ మోడీ దానిని ఖండించడం లేదు. భారత్‌ను టారిఫ్ కింగ్ అంటూ కించపరుస్తున్నా కిమ్మనడం లేదు. మోడీ వైఖరి ఆయన విశ్వగురు ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. నిజం చెప్పాలంటే అమెరికా ఒత్తిడికి లొంగిపోవడం మినహా మోడీకి మరో దారి లేదు. అమెరికాను ప్రతిఘటించే శక్తి ఆయనకు లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక సంబంధాలు అమెరికాకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయ ఐటీ ఉద్యోగులు పనిచేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నారు. అమెరికా మార్కెట్ నుంచే మన ఐటీ సంస్థలు ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్నాయి. కాబట్టి సుంకాలైనా, సేవలైనా మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మన విదేశీ ఖాతా సమతూకం దెబ్బతింటుంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సి ఉంది. వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. మనకు ఎక్కువగా ఆదాయం వస్తున్నది అమెరికా ఇన్వెస్టర్ల నుంచే. నయా సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచే మనం అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్నాం.
రంగులు మారుస్తున్న అమెరికా
అమెరికావి ఊసరవెల్లి రాజకీయాలు. తన లక్ష్యాలను సాధించుకోవడం కోసం అది రంగులు మారుస్తుంటుంది. మిత్ర దేశాలను శత్రు దేశాలుగా మార్చేస్తుంది. పొడ గిట్టని దేశాలను అక్కున చేర్చుకుంటుంది. అమెరికా తన భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థి అయిన చైనాకు వ్యతిరేకంగా భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అనధికారిక క్వాడ్ కూట మిని ఏర్పాటు చేసింది. ఘర్షణలు కాకపోయి నా ఉద్రిక్తతలను రేకెత్తించడమే దీని ఉద్దేశం. చైనాను ఢకొీనడానికి భారత్ సాయం తీసుకో వాలన్నది అమెరికా వ్యూహం. ఈ విషయంలో భారత్ కూడా సానుకూలత ప్రదర్శించింది. అందుకే క్వాడ్ కూటమిలో చేరింది.
ఫెవికాల్ బంధం ఏమైంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES