తక్షణమే వివరాలు వెల్లడించాలి
ఓయూ పదోన్నతుల అవకతవకల నివేదిక బహిర్గతం చేయాలి : ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓయూ సీనియర్ ప్రొఫెసర్ అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్టుని బహిర్గత పరచాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిల్ చైర్మెన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కొంతమంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లలో జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ హయాంలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అనేక కార్యక్రమాలు జరిగాయనీ, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోని ఓయూలో అనేక అందోళనలు చోటుచే సుకున్నాయని. దీంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ విశ్రాంత ప్రొఫెసర్ తిరుపతిరావు చైర్మెన్‌గా కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఆ కమిటీ రిపోర్టు సమర్పించినా ఇప్పటివరకు వివరా లు బహిర్గతం చేయలేదనీ, తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, ఓయూ అధ్యక్షులు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య, నాయకులు అశ్విన్ ఉన్నారు.
ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్టు ఏమైంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



