Saturday, January 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఈ నగరానికి ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది?

- Advertisement -

తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ నేడు ఒక క్లిష్టమైన సంధిదశలో ఉంది. ఒకవైపు విశ్వనగర కలలు, మరోవైపు విధ్వంసకర నిర్ణయాల మధ్య సామాన్యుడు నలిగిపోతున్నాడు. దేశంలో ముస్లిం, మైనార్టీలపై ‘అధికార’ బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి రాష్ట్రంలో మాత్రం ‘హైడ్రా’ రూపంలో ముంచుకొస్తున్నాయి. ఇవి కేవలం భవనాలను మాత్రమే కాదు, సామాన్యుడి సొంతింటి కలలను, దశాబ్దాల కష్టాన్ని కూడా నేలమట్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో నేడు ‘హైడ్రా’ వ్యవహారం రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్టికల్‌ 300ఏ ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఏ పౌరుడి ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదు, కానీ క్షేత్రస్థాయిలో సర్వే సెటి ల్మెంట్‌ రూల్స్‌ను పక్కనపెట్టి కూల్చివేతలు సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అనుమతు లిచ్చి, రిజిస్ట్రేషన్‌ శాఖ ఫీజులు వసూలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు అవే భవనాలను అక్రమమనడం పచ్చి మోసం కాదా? హైకోర్టు ఇప్పటికే ”ప్రభుత్వం చట్టం కంటే పైన ఉందా” అని ప్రశ్నించడం వ్యవ స్థాగత వైఫల్యానికి అద్దం పడుతోంది. బాధ్యులైన అధికారులను వదిలేసి, బాధితులైన ప్రజలను శిక్షంచడం ఏ రకమైన న్యాయం? తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రియల్‌ ఎస్టేట్‌ రంగం నేడు మరణశయ్యపై ఉంది. గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు 40శాతం పడిపోగా, సుమారు రూ. 40వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఎఫ్‌.టి.ఎల్‌, బఫర్‌ జోన్ల పున:నిర్వచనం పేరుతో నెలకొన్న గందరగోళం వల్ల బ్యాంకులు సుమారు రూ.25వేల కోట్ల లోన్‌ అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టాయి. ఒకప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న నగరం, నేడు అనిశ్చితికి నిలయంగా మారింది. ఇన్వెస్టర్లు సురక్ష్షితమైన బెంగళూరు లేదా దుబారు మార్కెట్ల వైపు మొగ్గు చూపుతుండటం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాద ఘంటిక. 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మూసీ ప్రక్షళన ప్రాజెక్టుపై పారదర్శకత శూన్యం. పక్కా డీపీఆర్‌ లేకుండానే వేల కుటుంబాలను రోడ్డున పడేయడం మానవ హక్కుల ఉల్లంఘన. థేమ్స్‌ నది తరహా అభివృద్ధి మాట ఎలా ఉన్నా, వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఇంత భారీ బడ్జెట్‌ వనరుల సమీకరణ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రాజెక్టు అభివృద్ధి కోసమా లేక రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసమా అన్న అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.నగర అభివఅద్ధి అంటే కేవలం పాత వాటిని కూల్చడం కాదు, ప్రజల నమ్మకాన్ని కాపాడటం. ప్రభుత్వం తన శక్తిని కేవలం విచారణలు, కూల్చివేతలకు పరిమితం చేయడంతో మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడింది. మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్ల పనుల వ్యయం జాప్యం వల్ల ఇరవైశాతం పెరిగే అవకాశం ఉంది. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి కానీ, ప్రజల ఆస్తులు, హక్కులు రాజకీయాల కోసం బలికాకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా పాలనా పద్ధతి మార్చుకుని, పౌరులకు ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి.
– ఫిరోజ్‌ ఖాన్‌, 9640466464

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -