Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయం20 ఏండ్లలో ఎన్డీఏ ఏంచేసింది?

20 ఏండ్లలో ఎన్డీఏ ఏంచేసింది?

- Advertisement -

బీహార్‌ ప్రజల్ని పట్టించుకోని నితీశ్‌ సర్కార్‌
అవమానించేందుకు కూడా ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకోవాలి’ : ప్రధానికి ప్రియాంకా గాంధీ సలహా


సోనాబర్సా
: ప్రతిపక్ష నేతలందరినీ ఎగతాళి చేస్తూ దేశాన్ని, బీహార్‌ను ప్రధాని మోడీ అవమానిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అందుకే అవమానించేందుకు కూడా మోడీ ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బీహార్‌ సోనాబర్సాలో ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. మోడీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప, బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి, అరాచకాల గురించి మాట్లాడటం లేదని ఆక్షేపించారు.

బీహార్‌ అభివృద్ధి గురించి బదులుగా, ప్రతిపక్ష నేతలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. గత 20 ఏండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌కు ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని బీహార్‌ సర్కార్‌ను నియంత్రించే రిమోట్‌ ఢిల్లీలో ఉందని ఆరోపించారు. ”ఉపాధి కావాలా వద్దా? విద్యా కావాలని చెప్పండి. అందరూ ఒక నిర్ణయం తీసుకొండి. ఎన్నికలు వస్తున్నాయి. అందరూ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతారు. అందరి మాటలు వినండి. వారి మాటలను బేరిజు వేసుకొండి. వివేకంతో ఆలోచించండి. ఓటేయాలని ప్రియాంక గాంధీ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -