Friday, December 19, 2025
E-PAPER
Homeసినిమాతండ్రి మీద కొడుకు కేసు వేస్తే?

తండ్రి మీద కొడుకు కేసు వేస్తే?

- Advertisement -

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. బత్తల సతీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం విడుదల చేశారు. దర్శకుడు సతీష్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం వినోద్‌ కుమార్‌కి కం బ్యాక్‌ అవుతుంది. ఆయన ఫిల్మోగ్రఫీలో ఓ ‘మామ గారు’ చిత్రం లాగా ఈ సినిమా కూడా ఉండిపోతుంది. మా హీరో సాయి సింహాద్రి నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు.

ఇందులో కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్‌గా చూపించాం’ అని అన్నారు. ‘ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలి అని ఉంది. ఈ కథ రియల్‌ లైఫ్‌లో నాకూ, మా నాన్నకు కనెక్ట్‌ అవుతుంది. ఈ కథ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ప్రతి కొడుకు… తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. నేను చిరంజీవికి డైహార్ట్‌ ఫ్యాన్‌ని. ఈ సినిమాను ఆయనకి చూపించాలని ఉంది’ అని హీరో సాయి సింహాద్రి చెప్పారు. నటుడు వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఇది రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమా కాదు.. స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ మూవీ’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -