‘చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, నేను ఫీల్ అయిన ప్యాషనేటింగ్ ఎలిమెంట్స్‌తో ‘మిరారు’ కథని డెవలప్ చేశా. ఇది పక్కా మన రూటేడ్ కథ. ఆడియన్స్ అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను’ అని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అన్నారు.
హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘మిరారు’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శనివారం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మీడియాతో ముచ్చటించారు.
అశోకుడి వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయనే ఒక మిత్ ఉంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది ‘మిరారు’ ఐడియా. ఈ కథని యాక్షన్ అడ్వంచర్‌గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్. కథ పూర్తిగా ప్రజెంట్‌లోనే జరుగుతుంది.
ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు యాంబిషన్ పెద్దదని తెలుసు. అయితే ఈ సినిమా చేసిన ప్రాసెస్ డిఫరెంట్. నటీనటులందరినీ రియల్ లోకేషన్స్‌లోకి తీసుకెళ్ళాం. మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో .. అన్నింట్లో రియల్‌గా చేశాం. మొత్తం షూటింగ్‌లో ఒక్క యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన సినిమా అద్భుతంగా వచ్చింది. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయిలాండ్.. మొత్తం ఏసియా అంతా తిరిగేశాం.
ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అయితే వీటిని రెగ్యులర్‌గా కాకుండా ఫాస్ట్ యాక్షన్‌గా ట్రై చేశాం. తేజ థాయిలాండ్‌లో శిక్షణ తీసుకున్నారు.
పాజిటివ్ సైడ్ ఉంటూ నేచురల్ అగ్రేషన్ ఉన్న ఒక యాక్టర్ కావాలి. దీనికి మనోజ్ కరెక్ట్‌గా ఫిట్ అయ్యారు. అలాగే వనరబుల్‌గా ఉంటూ అదే సమయంలో స్ట్రెంత్‌గా కూడా కనిపించే ఒక పాత్ర కావాలి. దీనికి శ్రియా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఇందులో తల్లీ కొడుకుల ఎమోషన్ చాలా కీలకం. శ్రియా అద్భుతంగా చేశారు. జటాయువు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. అది చాలా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. దీనికోసం యానిమేట్రానిక్ టెక్నాలజీ ఉపయోగించాం. అగస్త్య ముని పాత్రలో జయరాం కనిపిస్తారు. తాంత్రిక గురువు పాత్రలో జగపతి బాబు కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు కీలకంగా వుంటాయి.
మా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియానే వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా చేయడంతో మాకు చాలా హెల్ప్ అయ్యింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. నిర్మాత విశ్వప్రసాద్ మా విజన్‌కి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ కాపీ చూసి, ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి కథలకు సంగీతం చాలా ముఖ్యం. మ్యూజిక్ కథని ఎలివేట్ చేసింది. మంచి హై క్రియేట్ చేసేలా మ్యూజిక్ చేశారు. సీక్వెల్ చేసే పొటెన్షియల్ ‘మిరారు’ కథకి ఉంది.
ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టులకు దొరికితే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES