స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్సిటీ’ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీంతో పాటు పలువురు విద్గ్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ ఈ సినిమా కేవలం విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి చిత్రం అని కొనియాడారు.
ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోట పలుకుల రమేష్ గొప్పగా రాశారు. గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపరు లీక్‌లు ముఖ్యంగా గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీకులు చూస్తుంటే ఈ చదువులకేమైంది అనిపిస్తుంది. ఇలా జరుగుతూ ఉంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక నెల రాలుతుంటే కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి?, వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి? ప్రశ్నా పత్రాలు లీకులు మాయం కాకూడదు. అందుకే విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే ఈ చిత్రం’ అని అన్నారు.
ప్రశ్నా పత్రాలు లీకైతే?
- Advertisement -
- Advertisement -