– విధుల గైరాజరైన వారిపై చర్యలకు ఆదేశాలు
– ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
– జిల్లా కలెక్టర్ కె హైమావతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపుర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. భాను మెడికల్ ఆఫీసర్ లీవ్ లో ఉన్నారని ఒక్క నర్సు తప్ప మిగతా సిబ్బంది స్రవంతి, మాధురీ, సరిత, శ్రీలత, పూలమ్మ, శ్రీకాంత్ ఎవ్వరు కూడా విధుల్లో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులలో గైరాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ ఎచ్ ఓ కీ ఫోన్ ద్వారా కలెక్టర్ తెలిపారు. డిప్యూటిషన్, ఇతరత్ర ఫీల్డ్ విధుల్లో ఉంటే తప్పనిసరిగా ఆర్డర్ కాఫీ హాస్పటిల్ లో ఉండాలని ఆదేశించారు. అలాగే పై అధికారి సెలవు మంజూరు లేటర్ రూపంలో చేశాకే సిబ్బంది సెలవు తీసుకోవాలని అనుమతి లేనిదే గైర్హాజరు కావద్దని హెచ్చరించారు. తహసీల్దార్ తరచూ పి ఎచ్ సి నీ మానిటర్ చెయ్యాలని ఆదేశించారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
హుస్నాబాద్ మండలంలోని జిల్లెళ్ళ గడ్డ గ్రామంలోని నేషనల్ హైవేపై ఏర్పాటుచేసిన ఎస్ ఎస్ టి శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి వాహనాల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజిస్టర్ వెరిఫై చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 24/7 ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. వాహన పరిశీలన మొత్తం వీడియో గ్రఫీ తప్పనిసరిగా చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజిస్టర్ లు మెయింటైన్ చేస్తూ అత్యంత పారదర్శకంగా సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ తో పాటు తాహసిల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.