పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగ రాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఆధునిక కాలానికి అనుసంధాన మైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా, గురువారం తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియా సిటిని పెంచుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టు బడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
డబ్బు కోసం అత్యాశ పడితే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



