Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాసంగి సన్నాల బోనస్ ఏమాయె.?

యాసంగి సన్నాల బోనస్ ఏమాయె.?

- Advertisement -

4 నెలలుగా రైతుల ఎదురుచూపులు
నవతెలంగాణ- మ ల్హర్ రావు

దసరా, దీపావళి పండుగలు పోయి ఖరీఫ్ పంటలు చేతికి వస్తున్నా..సన్న వడ్లకు రావాల్సిన యాసంగి బోనస్ ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్ పై ఆశతో ఎన్నో కష్టనష్టాల కోర్చి సన్నాలు సాగు చేశామని,ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కన్నీళ్లే దిక్కవుతున్నాయని రైతులు చెబుతున్నారు.

మండలంలో గత యాసంగి సీజన్లో15.552 మెట్రిక్  టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది.అయితే సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 1652 మంది రైతులు 10.552 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.అలాగే డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాల్లో 5 వేల టన్నుల ధాన్యం విక్రయించారు.వీరికి బోనస్ రూపంలో పిఏసిఎస్ రైతులకు రూ.25.30 లక్షలు,డిసిఎంఎస్ రైతులకు 15 లక్షల బోనస్ రావాల్సి ఉంది. మరికొంత మంది రైతులు సన్నాలు పండించినా వారి అవసరం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు.

4 నెలలుగా ఎదురు చూపులు…

నాలుగు నెలలు కావస్తున్నా బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..అయితే ప్రస్తుత సీజన్లో చాలా మంది సన్నాలు సాగు చేశారు.భారీ వర్షాలతో వందలాది ఎకరాల వరి పంట నీటమునిగింది.అయితే గత యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదని, ఇక ఖరీఫ్ సీజన్ బోనస్ ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఖరీఫ్ పంటలు అకాల వర్షాలతో దెబ్బతినడంతో పెట్టుబడులు రాని పరిస్థితి.కనీసం యాసంగి బోనస్ వస్తే కొంత ఉపశమనం ఉంటుందని ఆశతో రైతులు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -