Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమా పైసలపై కేంద్రం పెత్తనమేందీ?

మా పైసలపై కేంద్రం పెత్తనమేందీ?

- Advertisement -
  • సీపీఎస్‌ రద్దయ్యేదాకా పోరాటం
  • ఇక ఢిల్లీలో ఉద్యమిస్తాం
  • సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలి: పీఆర్టీయూటీఎస్‌ మహాధర్నాలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
    ‘మా పైసలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేందీ?. ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌లోకి మారితే ఉద్యోగులు దాచుకున్న సొమ్మును చెల్లించకపోవడం సరైంది కాదు. ఇక ఢిల్లీలో ఉద్యమిస్తాం’ అని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వేలాది మంది ఉపాధ్యాయులు నల్ల దుస్తులు ధరించి భారీగా తరలొచ్చారు. పెన్షన్‌ విద్రోహ దినం పేరుతో ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన మహాధర్నా నుద్దేశించి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిందనీ, మ్యానిఫెస్టోలోనూ పొందుపర్చిందని గుర్తు చేశారు. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయన్నారు. రాష్ట్రంలో సీపీఎస్‌ అమల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల భాగస్వామ్యం ఉందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టు కోవాలని కోరారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే ఉద్యోగు లు, ఉపాధ్యాయుల్లో రేవంత్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచి పోతారని చెప్పారు. ఒకవేళ రద్దు చేయకుంటే సీపీఎస్‌ ను రద్దు చేసే ప్రభుతాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికారంలోకి తెచ్చుకుంటారని అన్నారు. భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ న్నారు. సీపీఎస్‌ రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని చెప్పారు. ఏఐఎఫ్‌టీవో సెక్రెటరీ జనరల్‌ సిఎల్‌ రోజ్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసిన రాష్ట్రాలపై కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శి ంచారు. ఉద్యోగి వాటా, ఆ రాష్ట్రవాటా తిరిగి చెలించబో మంటూ చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేయాలనీ, సామ్మును రాబట్టుకునేందుకే కేంద్రంపై పోరా టం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దయ్యిందని గుర్తు చేశారు. ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మాట్లా డుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ను ప్రకటించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌ రెడ్డి, పీఆర్టీ యూటీఎస్‌ అధ్య క్షులు గుండు లక్ష్మణ్‌, ప్రధాన కార్య దర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, బి గీత, చిత్తలూరి ప్రసాద్‌, మాజీ బాధ్యులు లక్ష్మణ్‌, వెంకట్‌ రెడ్డి, వంగ మహేందర్‌ రెడ్డి, టీటీ జేఏసీ నాయకులు రాజ గంగా రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణ మూర్తి, కటకం రమేష్‌, కుత్బు ద్దీన్‌, షకీల్‌ అహ్మద్‌, దిలీప్‌ రెడ్డి, జగదీశ్‌, పోచయ్య, విజయసాగర్‌, నాగరాజు, జగన్మోహన్‌ గుప్త, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad