– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని మాజీ మంత్రి టి హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అరెస్టు చేసేందుకేనా విద్యాశాఖను, హోం శాఖను తమ వద్ద పెట్టుకున్నది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీరిచ్చిన మోసపూర్తి హామీల గురించి నిలదీస్తున్నారనీ, వారిపై కూడా నిషేదాజ్ఞలు విదిస్తారా? అని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెల్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. 22నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయటమేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES