నేటి సమాజంలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతల్లో ప్రజలు ఎవరికివారే బిజీగా ఉంటున్నారు. తినడానికి సమ యం కూడా దొరక్క కష్టపడుతున్నారు. భార్యభర్తలు పనిచేస్తేనే ఈ మహా నగరంలో బతికే పరిస్థితి ఉండటంతో చేరో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో తాము చేసే పనుల్లో తీరికలేక పోవడంతో భోజనం తినేందుకు హోటల్స్, మెస్‌లు ఇతర ఫుడ్ పాయిం ట్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్‌లో నాణ్యత లేకుండా ఆహార పదార్థలు వండుతున్నట్టు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శుచి, శుభ్రత లేకుండా ఇష్టారీతినా నాణ్యత లేనివి ఉపయోగించడంతో జనాలు అనారోగ్యం బారిన పడుతు న్నారని అనేక సర్వేల ద్వారా తెలుస్తున్నది. ఇదే సమయంలో స్థానిక కర్రీ పాయి ంట్స్‌లో కూరలు తీసుకుని అన్నం మాత్రం ఇంట్లో చేసుకుని పోయే ధోరణి బాగా పెరిగింది. ఈ నేపథ్యం లో కర్రీ పాయింట్లకు బాగా గిరాకీ పెరిగింది. అయితే ఇందులో నాణ్యత ప్రశ్నా ర్థకంగా ఉంటున్నది. కూరలు పప్పులు, ఇతర ఆహార పదా ర్థాలను తయారు చేసే విధానంలో నాణ్యత శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే సందే హం ఉంటున్నది. అయినా సరే, తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని తింటూ కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. వీటి విక్రయాల ధరల పట్టికలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో దగ్గర ఒక్కోరేటుతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇందులో నూనె మాత్రం కల్తీదే వాడుతున్నారనేది బహిరం గంగానే విమర్శిస్తున్నారు. ఈ కర్రీ పాయి ంట్లలో ఎప్పుడు చూసినా గిన్నెలనిండా కూరలు, పప్పులు నిల్వగా కనిపిస్తుం టాయి.వీటిని ఎప్పుడు తయారు చేస్తారో అనే అనుమానం కలుగు తుంది. మిగిలిన వాటిని ఏం చేస్తారనేది ఎవరికీ తెలి యదు. పైకి మాత్రం ప్రెష్‌గానే వంటలు చేస్తున్నట్టు చెబుతారు. ప్రజలకు శుచి, శుభ్రత నాణ్యమైన పప్పులు, కూరలు అందించుటకు ఆహార భద్రత, స్థానిక సంస్థల అధికారులు కర్రీ పాయింట్లను కూడా తరచుగా పర్యవేక్షణ చేయాలి. సరసమైన ధరలకు నాణ్యతతో కూడిన పదార్థాలు అందజేయుటకు తగు చర్యలు తీసుకుని నగరవాసులను అనా రోగ్యాల బారిన పడకుండా కాపాడాలి.
– డి.రాంచందర్ రావు,
9 849592958
కర్రీ పాయింట్లలో నాణ్యతలేమి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES