అక్రమ నిర్మాణాల నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది
అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ -కాటారం
కాటారం సబ్ డివిజన్లో మండల పరిధిలోని కొన్ని గ్రామపంచాయతీలలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు నోటీసుల వరకే పరిమితమైయ్యారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆ నిర్మాణాలు పూర్తికావస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదదో అర్థం కావటం లేదని అన్నారు. వివరణ కోరితే అడిగిన ప్రతిసారి నేను నోటీసులు ఇస్తున్నామని చెప్పడం తప్పితే సరైన సమాధానం లేదని అన్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఏంటో అర్థం కాని పరిస్థితి కాటారంలో ప్రస్తుతం ఉందని, కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా రోజు రోజుకి బోనాలు పూర్తి కావస్తున్న అధికారులు నోటీసుల వరకే పరిమితమై సంబంధిత శాఖలు నిర్లక్ష్యాన్ని వహిస్తూ వినతుల అందజేసిన ప్రతిసారి స్పందిస్తున్నట్టుగా నటిస్తున్నారు తప్ప ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేవని అన్నారు. దీనివలన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్న ప్రభుత్వ అధికారులకు ఏ పట్టింపు లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నదని, కబ్జాదారులు రోజురోజుకీ అధికారుల అండతోనే చెలరేగిపోతున్నారని అన్నారు. ఏ అధికారికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. అని కిందిస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేకపోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమ నిర్మాణాలకి బాధ్యత ఎవరిదో చెప్పాలని అదే నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఎన్నిసార్లు మొరపెట్టినా భూమిలేదని చెప్పి అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కనబడటం లేదా ప్రశ్నను అందించారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలను కూడగట్టుకుని పెద్ద ఎత్తున అధికారులపై ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.