Monday, June 9, 2025
E-PAPER
Homeసినిమా'శంబాల' రహస్యం ఏమిటి?

‘శంబాల’ రహస్యం ఏమిటి?

- Advertisement -

హీరో ఆది సాయి కుమార్‌ నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’. షైనింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్‌ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో అర్చన అయ్యర్‌, స్వాసిక, రవివర్మ, మధునందన్‌, శివకార్తీక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘శంబాల’ మేకింగ్‌ వీడియోతో మేకర్స్‌ అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు.
‘ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమా ధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’.. ‘పంచ భూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు.. దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం’.. ‘ఇప్పుడు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే’.. అంటూ వచ్చిన వాయిస్‌ ఓవర్‌.. చూపించిన డైలాగ్స్‌తో సినిమా రేంజ్‌ ఏంటో అందరికీ అర్థం అవుతోంది. ఇందులో ప్రవీణ్‌ కే బంగారి అందించిన విజువల్స్‌, శ్రీచరణ్‌ పాకాల ఇచ్చిన బీజీఎం అన్నీ కూడా నెక్ట్స్‌ లెవెల్లో ఉన్నాయి. పాన్‌ ఇండియన్‌ మూవీకి సరిపడా సబ్జెక్ట్‌, కంటెంట్‌ ఉందని ఈ టీజర్‌ చెప్పకనే చెప్పింది. ఇక ఇందులో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఉంటుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ అనౌన్స్‌ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -