Friday, June 6, 2025
E-PAPER
Homeకరీంనగర్పంచాయితీ రికార్డులకు భద్రత ఏది..?

పంచాయితీ రికార్డులకు భద్రత ఏది..?

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి  : గ్రామపంచాయతీలో గ్రామానికి సంబంధించిన రికార్డులకు భద్రత లేకుండా పోయింది. తంగళ్ళపల్లి మండలం గండి లచ్చి పేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామానికి సంబంధించిన వివిధ రికార్డులు ఏళ్ల తరబడి ఉంటాయి. ఆ రికార్డులను భద్రపరిచేందుకు గ్రామపంచాయతీలో రెండు బీరువాలో ఏర్పాటు చేశారు. కానీ ఆ బీరువాలకు తలుపులు సరిగా లేక పోవడంతో రికార్డులకు భద్రత లేకుండా పోయింది. ఆ బీరువాలోకి ఎలుకలు చేరి రికార్డులను నామరూపాలు లేకుండా చేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చెదలు పట్టే ప్రమాదం కూడా ఉంది. గ్రామపంచాయతీ రికార్డులు అంటే ఇంత నిర్లక్ష్యమా…? అంటు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

పంటకు మోతాదు మించి ఎరువులు వాడవద్దు…

ఘనంగా జరిగిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు,వికాస కృషి సంకల్పు యోజన

నవతెలంగాణ — తంగళ్ళపల్లి 

రైతులు పండించే పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు రైతులకు సూచించారు.మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం రైతులతో, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేశారు. పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను ఉపయోగించాలన్నారు.పచ్చిరొట్ట, ఎరువులు, వర్మి కంపోస్ట్, జీవన ఎరువులు, భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటకు ఎరువులన అందించాలన్నారు. చీడపురుగుల ఉధృతిని బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలన్నారు. పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, డా. సి.హెచ్. రమేశ్, డా.హిందూజ. ఎన్.ఏ,శాస్త్రవేత్త డా.శృతి, కృషి విజ్ఞాన్ కేంద్ర శాస్త్రవేత్తలు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, వ్యవసాయ అధికారి కె. సంజీవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇ .శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కె. భాస్కర్, విజయందర్ రెడ్డి,వ్యవసాయ విస్తరణ అధికారులు, గౌతమి, లక్ష్మణ్ , విద్యార్థులు, సిద్దార్థ్ సన్నీ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -