Saturday, December 20, 2025
E-PAPER
Homeఆటలుదేశవాళీ సీజన్‌ ముగిశాక టీ20 లీగ్‌తో ఏం ఉపయోగం?

దేశవాళీ సీజన్‌ ముగిశాక టీ20 లీగ్‌తో ఏం ఉపయోగం?

- Advertisement -

హెచ్‌సీఏపై అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి విమర్శ

హైదరాబాద్‌ : దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ఆరంభానికి ముందు నిర్వహించాల్సిన హెచ్‌సీఏ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టీ20 టోర్నమెంట్‌ను, ఐపీఎల్‌ వేలం ముగిసిన తర్వాత నిర్వహించడం ఏం ఉపయోగమని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీటీడీసీఏ) అధ్యక్షులు, శాట్స్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇవే పోటీలను దేశవాళీ సీజన్‌కు ముందు నిర్వహిస్తే మరింత మంది ప్రతిభావంతులకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, ఐపీఎల్‌ వేలంలో పాల్గొనే అవకాశం లభించేదని అల్లీపురం అభ్రిపాయపడ్డారు. హైదరాబాద్‌లో 200పైగా క్లబులు ఉన్నట్టే జిల్లాల్లో 300 క్లబ్‌లకు సభ్యత్వం ఇవ్వాలని, కొత్త జిల్లాలకు సభ్యత్వం ఇచ్చేలా హెచ్‌సీఏపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌కే పరిమితమైన హెచ్‌సీఏ స్థానంలో.. జిల్లాల క్రికెట్‌ అభివృద్ది కోసం ఏర్పాటైన టీడీసీఏను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని అల్లీపురం విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -