ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే.. ప్రపంచ ఆర్థికవ్యవస్థపై అంత ప్రభావం : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తోన్న యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఇంకా సాధించాల్సింది ఏముందని ప్రశ్నించారు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత ఉండాలని నేషనల్ ప్రెస్ క్లబ్లో చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని, దాని పొరుగుదేశాలకు హాని కలగకుండా ఉండేందుకు ఆ దేశ సైనిక సామర్థ్యాలను తగ్గించాలనే ప్రాథమిక లక్ష్యాలకు అమెరికాకు తాము కూడా మద్దతిచ్చినట్టు అల్బనీస్ తెలిపారు.
యుద్ధంలో ఆ లక్ష్యాలు నెరవేరాయన్నారు. అయినా.. యుద్ధం కొనసాగించడానికి ఇంకా అక్కడ సాధించాల్సింది ఏముందని ఆయన ప్రశ్నించారు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదన్నారు. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే.. ప్రపంచ ఆర్థికవ్యవస్థపై దాని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు.. ఇది ప్రారంభమవడానికి ముందు తమను ఎవరూ సంప్రదించలేదని అల్బనీస్ బదులిచ్చారు.
ఇరాన్లో సాధించాల్సింది ఏముంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



