– 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్నోళ్లకు అన్యాయం
– ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలోని డైలీవేజ్, పీఎంహెచ్ వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్న డైలీవేజ్, పీఎంహెచ్ వర్కర్లకు వేతనాలు తగ్గించడం, ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం సరిగాదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న వారి న్యాయమైన సమస్యల్ని రాష్ట్ర సర్కారు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తమ జీతాల తగ్గింపును నిరసిస్తూ, టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ గత నెల 12వ తేదీ నుంచి 3070 మంది డైలీవేజ్, కంటిన్‌జెంట్, పార్ట్‌టైమ్ వర్కర్లు సమ్మె చేస్తున్నా సర్కారుకు పట్టదా? అని ప్రశ్నించారు. వారంతా రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేస్తూ 326 ఆశ్రమ పాఠశాలలు, 136 హాస్టల్స్, 163 పీఎంహెచ్ హాస్టల్స్‌లో 1,34,527 మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకనుగుణంగా నూతన పోస్టులను శాంక్షన్ చేయకుండా, రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా వారి స్థానంలో డైలీవేజ్ / పార్ట్‌టైం, కంటిన్‌జెంట్ పేరుతో వర్కర్లతో పనిచేయించుకుంటున్నారనీ, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం ధిక్కరించడం సరిగాదని పేర్కొన్నారు. కొందరికి టైం స్కేల్ వర్తింపజేసి మితగా వారిని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తే 35 ఏండ్ల నుంచి వర్కర్లు పొందుతున్న హక్కును కోల్పోతారనీ, ఏజెన్సీల చేతిలో మోస పోతారని తెలిపారు. టైమ్ స్కేల్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి, వర్కర్‌కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వేతనాలు తగ్గించడమేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES