సామ్రాజ్య వాదం కొరకు
సమానత్వ హక్కుల కొరకు
సామ్యవాదం కొరకు
స్వతంత్ర బతుకు కొరకు
రెండు రాజ్యాల మధ్య
రెండు వర్గాల పోరు
రెండు దేశాల మస్తిష్కములో
గెలుపుకై ఆశాభావంతో
అలుపెరుగని పోరాటం…కానీ
ఆధిపత్యం కొరకు
మానవత్వాన్ని గాలికొదిలి
మతాలమధ్య చిచ్చు పెట్టి
రెండు మస్తిష్కాల నడుమ
మత పురుగు మౌడ్యంతో
చేసే అకార వికార కరాళ నత్యం …
రాజకీయ కథాకళిలో
రగులుతున్న భారతమ్మ
మతపిచ్చి’కి మంచి నిదర్శనం నీవేనమ్మా!
అమాయక జీవుల రక్తపాతం
ఒకే ఒక్క ప్రత్యేక స్ధలానికై
ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు
కన్నీటి గాథలు …ససేమిరా
అంటూ కాలుదువ్వే కవ్వింపు చర్యలు
ఈ భయానక యుద్ధ వాతావరణంలో
బలసిన దేశాల ఆయుధాల వ్యాపారం
స్నేహాస్తం పేరుతో మట్టుబెట్టు ఉపదేశాలు
మానవత్వ ఛాయలు మంట గలిపిన తీరు
ఇది రెండు దేశాల మధ్య కాదు
రెండు మతాల మధ్య
జరుగుతున్న సంఘర్షణ
దీన్ని యుద్ధం అందామా ?
- న్యాలకంటి నారాయణ,
9550833490