Sunday, December 21, 2025
E-PAPER
Homeకవితఏ తల్లికి తెలుస్తుంది?

ఏ తల్లికి తెలుస్తుంది?

- Advertisement -

అమ్మా! నీవు మా ఇద్దరికీ
ఊపిరి పోసినట్లుగానే
రెండు యుద్ధ రంగాల్లా
శత్రువులుగా ఎదిగాం.
యుద్ధం జరిగే కొద్ది నిన్ను శత్రువుగా మలచి
ఆయుధాలుగా మారాం.
కొద్ది దూరంలోనే
రేపటి అడుగు తొంగి చూస్తుంది…
అంతకు మించిన
ఆయుధాలతో యుద్ధం చేయాలని…
ఇక చిందే నెత్తుటి మరకలును
తుడవాటికి ఎంత కన్నీరు కావాలో?
సంద్రమంత బాధ
ఎన్నో లోతులకెళ్లి సుడులు తిరిగినా
ఉపయోగం లేదు.
తీపి విషం చిమ్మే హదయాలు
చేదు నిజం తెలియదు.
ఒక ఊపిరి ఇంకెన్నిటికీ ఊపిర్లు పోస్తుందో
ఏ తల్లికి ఎలా తెలుస్తుంది?
భూమికి జవాబు తెలియదు
సహనంతో నడుపుతుంది
కాలమనే కాపురాన్ని …
చందలూరి నారాయణరావు, 9704437247

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -