స్కీమ్‌లు రద్దు చేస్తానంటూ సీఎం బెదిరింపులు
500 రోజుల్లో అధికారంలోకి బీఆర్‌ఎస్
భారీ స్టేడియం కట్టి.. గోపీనాథ్ పేరు పెడతాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
పథకాలు రద్దు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నారని, అసలేం పథకాలు ప్రారంభించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నారని, ఈ బెదిరింపులు ప్రజాస్వామ్యానికి తగవని, ఈ రీతిలో మాట్లాడటం అహంకారానికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం రోడ్ షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023లో జూబ్లీహిల్స్‌లో అత్యధిక మెజార్టీ ఇచ్చింది రహమత్‌నగరమేనని, ఈసారి 12వేల మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉందని అన్నారు. భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న మాగంటి సునీతమ్మను విమర్శించడం సరికాదన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకున్నారని ఆరోపించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎంత అభివద్ధి జరిగిందో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. 500 రోజులు మాత్రమే రేవంత్‌రెడ్డికి సమయం ఉందని, ఆ తర్వాత బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హిల్స్‌లో భారీ స్టేడియం కట్టి దానికి మాగంటి గోపీనాథ్ పేరు పెడతామని, ఆయన చేసిన సేవలకు ఇది సరైన గౌరవం అవుతుందని అన్నారు.
ఏం పథకాలు ప్రారంభించారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



