ప్రజారంజకం తప్పదు …
ఆరు గ్యారంటీల అమలే అసలు సవాల్
స్వీకరించేందుకు సీఎం సిద్ధం!
ఇక ఆ దిశగానే పాలన
త్వరలో స్థానిక సమరం
అనేక అంశాల్ని వెలుగులోకి తెచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. 14వ తేదీ వరకు నిరీక్షణ తప్పదు. ఈ ఎన్నికల్లో యావత్ మంత్రివర్గం కాళ్లకు బలపాలు కట్టుకొని ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసింది. ఫలితంపై ఉత్సుకత ఎలా ఉన్నా, ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపి స్తోంది. ఈ ఉప ఎన్నికల ప్రచా రంలో అనేక ప్రభుత్వ అనుకూల, ప్రతికూల అంశాలు తెరపైకి వచ్చాయి. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ మ్యాప్‌ను కూడా దాదాపు ఖరారు చేసినట్టే కనిపిస్తోంది. సీఎం ఏ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని పెండింగ్ హామీలను ప్రజలకు అందించేందుకు కృషి పెరగాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ వినూత్నంగా తెచ్చిన ‘బాకీ కార్డు’పై ప్రజల్లో విస్తృత చర్చే జరిగింది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ రిజర్వేషన్ల అమలు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం పరోక్షంగా బెడిసికొట్టినట్టే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరుకునపెట్టాలని భావించినా, అది బూమ్‌రాంగ్ అవుతుందనే భయం కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ.2,500 బదిలీ, రైతు భరోసా కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయకూలీలకు రూ.12వేలు వంటి హామీల అమలు జరగాల్సి ఉంది. యువవికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత పథకం ద్వారా నెలవారీ పింఛన్లను రూ.4వేలకు పెంపు వంటి హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి స్కీం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి మాత్రమే అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా పాక్షికంగానే కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాజీవ్ యువవికాసం పథకం ద్వారా ప్రభుత్వం దరఖాస్తుల్ని స్వీకరించింది. కానీ ఇప్పటి వరకు అది పట్టాలెక్క లేదు. ప్రజల డిమాండ్లు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని బేరీజు వేస్తూ, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలనీ, అప్పుడే స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించగలమని ఆపార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లింపు వంటి అనేక ఆర్థికాంశాలు ప్రభుత్వం ముందు న్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లు కూడా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల డిమాం డ్లను పరిష్కరిం చాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఎన్నికలు, ఓట్లు, విజయాలపైనే దృష్టి పెడితే ప్రయోజనం లేదనీ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి!
ఒప్పించేదెలా !
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పులు మిగిల్చిందనీ, రూ.18వేల కోట్లకు మించి ఆదాయం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా, ఆ విషయం ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు కనిపించ ట్లేదు. ప్రతిపక్షాలు అడుగడుగునా కాంగ్రెస్ హామీల గురించి ప్రశ్నిస్తూ, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు తీవ్రంగానే పనిచేస్తున్నాయి. దీన్ని సమర్థవం తంగా తిప్పికొట్టాలంటే హామీల అమలుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే ఈ రెండేండ్ల పాలనలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల అమలును కూడా సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఏం చేద్దాం ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



