- వేసవి సెలవులు వారికీ వర్తించవా..!
- పిల్లలకు తప్పని భానుడి సెగలు
- ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు
- 15 రోజులు టీచర్లు కు,15 రోజులు ఆయాలకు
నవతెలంగాణ -పెద్దవూర
మండుటెండలో చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు, పెద్దలు నడు స్తుంటే తాము ఎండ వేడిమిని భరించి అయినా సరే.. చిన్నారులకు నీడనిచ్చి తాము ఎండలో అడుగులేస్తారు. ప్రస్తుత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సెలవులిచ్చి, చిన్నారులుఉండే అంగన్‌వాడీ కేంద్రాలకుమాత్రం ససేమిరా అంటుండడంతో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ఈ ఏడాది ఎండలు బాగా పెరిగాయి. దాంతో చిన్నారులకు భానుడి సెగ తప్పేట్టు లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు 48 రోజులపాటు వేసవి సెలవులను ప్రకటించింది. అయితే అంగన్‌వాడీ కేంద్రాలను మండుటెండలో సైతం నిర్వహిస్తుండడంతో చిన్నారులకు వేసవి సెగ తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2093 అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లీ, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, మునుగోడు ప్రాజెక్టులలో మొత్తం 83,991 మంది లబ్ధిదారులు వున్నారు. అందులో అందులో ఆరెళ్ల లోపు చిన్నారులు 28,586, మూడేళ్ళ నుంచి సంవత్సరం లోపు చిన్నారులు 19,234మంది, ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు చిన్నారులు 13,221 మంది ఉన్నారు. అదేవిధంగా అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పెద్దవూర, అనుముల, నిడమానూరు, తిరుమల గిరి సాగర్, మండలాలలో అంగన్‌వాడీ 255 అంగన్వాడీ కేంద్రాలలలో 12,280 మంది లబ్ధిదారులు వున్నారు ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు.మూడేళ్ల లోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య,తో పాటుగా పౌష్టికాహారం, అందిస్తున్నారు. ప్రతినెల కేంద్రాలలో వయసుకు తగిన ఎత్తు, బరువులు నిర్వాహకులు చేస్తున్నారు. పోషణ్ అభియాన్, అక్షరాబ్యాసం, జన్మదిన వేడుకలు, వంటివి కూడా నిర్వహిస్తున్నారు - నెరవేర్చని హామీలు..
అంగన్వాడి టీచర్లు ఆయాలు గతంలో చేసిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సమ్మెల సందర్భంగా మే నెల ఒకేసారి టీచర్లకు ఆయాలకు సెలవులుఅని చెప్పిన ప్రభుత్వం మాట మార్చింది. మే నెల మాసంలో ఎండలు ఎక్కువ అంగన్వాడి సెంటర్లకు పిల్లలు రాలేని పరిస్థితిలో ఉంది. అనారోగ్యాలకు గురై పోయే ప్రమాదం ఉంది. ఇతర ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు ఎందుకు సెలవులు లేదని ఏళ్ల తరబడిగా గ్రామాల్లో పట్టణాల్లో వయోవృద్ధులకు చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు ఆహారాన్ని అందిస్తూ మాతా శిశు మరణాలను తగ్గిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్ల,ఆయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నదని అంగన్వాడీ టీచర్లు, సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మే నెల అంతా టీచర్లకు ఆయాలకు ఒకేసారి సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఐదేళ్లలోపు వయసున్న వారే. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడం చిన్నారులకు అగ్ని పరీక్షగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు, తాగునీటి ఎడ్డది,చిన్నారులకు శాపంగా మారాయి. కొన్ని కేంద్రాలకు తలుపులు కూడా లేని పరిస్థితి ఉంది.జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు కూడా లేవు.నాసిరకం ఫ్యాన్లు ఇచ్చిన కొద్ది రోజులకే కాలిపోయాయి. అద్దె భవనాలకు తగినంత బాడుగ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గ్రామాలలో వసతులు లేని ఇరుకైన ఇళ్లల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల కష్టాలు వర్ణణాతీతం. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాని జిల్లా ఐసీడిఎస్ పిడి, జిల్లా కలెక్టర్ కు చాలాసార్లు అంగన్వాడీ, హెల్పర్స్, అండ్ వర్కర్స్జి, రాష్ట్ర, జిల్లా యూనియన్ తరుపునుంచి వినతి పత్రాలు అందజేసిన అధికారులు మాత్రం అంగన్వాడీ చిన్నారుల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడు టున్నారని టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన చెందు తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను మండుటెండలో సైతం నిర్వహిస్తుండడంతో చిన్నారులకు వేసవి ఎండలు అగ్ని పరీక్షగా మారిందని ఆందోళన చెందుతున్నారు.

-చిన్నారులకు అగ్ని పరీక్షగా ఎండలు
- వేసవి సెలవులు ఇవ్వాలి..
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలకు ప్రకటించి నట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వేసవి సెలవులు వర్తింపజేయాలి. ఐదేళ్లలోపు చిన్నారులు వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఎండ తీవ్రతతో అల్లాడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వాలి.
– అంబటి మణెమ్మ.. అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ సీఐటీయు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు..నిడమానూరు.