- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామానికి చెందిన అజ్మీరా తిరుపతి నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భూక్య రవీందర్ నాయక్, వార్డు సభ్యులు కలిసి ఆదివారం పరమర్శించి, బాధిత కుటుంబానికి సన్న బియ్యం బస్తాను అందజేశారు. అధైర్య పడొద్దని, అన్నీవిధాలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దేవేందర్, తిరుపతి, సమ్మయ్య, మాజి సర్పంచ్ ప్రమీల రాజునాయక్, ఉప సర్పంచ్ శ్యామల సింగ్ సనత్, సతీష్, పరమసింగ్ పాల్గొన్నారు.
- Advertisement -



