Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'ఏ ఊరికెళ్తావే పిల్లా..'

‘ఏ ఊరికెళ్తావే పిల్లా..’

- Advertisement -

అర్జున్‌ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘సీతా పయనం’. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్‌, నిరంజన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. అర్జున్‌, ధ్రువ సర్జా పవర్‌ఫుల్‌ పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం గద్దర్‌ భార్య విమలా గద్దర్‌ ఈ సినిమా నుంచి ‘ఏ ఊరికెళ్తావే పిల్లా..’ పాటను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా కనకవ్వ, గంగవ్వ, జోగిని శ్యామల, బేబీ వంటి జానపద కళాకారులను చిత్ర బృందం సత్కరించింది. ఈ వేడుకలో గద్దర్‌ కుమార్తె వెన్నల గద్దర్‌ కూడా పాల్గొన్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ సాంగ్‌ని ఎనర్జిటిక్‌ ఫోక్‌ నెంబర్‌గా కంపోజ్‌ చేశారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, మధు ప్రియ పాడిన విధానం, చంద్రబోస్‌ సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. వినగానే కనెక్ట్‌ అయ్యే ఈ సాంగ్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -