Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'ఏం జరుగుతోంది.. తెలుసా మనసా..?'

‘ఏం జరుగుతోంది.. తెలుసా మనసా..?’

- Advertisement -

దీక్షిత్‌ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీతో దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందిస్తున్నారు. ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి ‘ఏం జరుగుతోంది…’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహాబ్‌ ఛాట్‌ బస్టర్‌ ట్యూన్‌ అందించారు.
‘కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో, సతమతమౌ తలపేదో, నిలదీసి నన్నెడుగెనుగా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, మనసా తెలుసా..’ అంటూ హార్ట్‌ టచింగ్‌ లవ్‌ ఫీల్‌తో సాగుతుందీ పాట. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ త్వరలోనే అనౌన్స్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కష్ణన్‌ వసంత్‌, సంగీతం – హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – ఎస్‌ రామకష్ణ, మౌనిక నిగోత్రి, రచన -దర్శకత్వం – రాహుల్‌ రవీంద్రన్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad